పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..!!

-

వచ్చే నెల 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ..బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. ఆ రోజున పలు థియేటర్లలో ‘జల్సా’ను రీ-రిలీజ్ చేయనున్నారు. అందుకు ఆల్రెడీ ఏర్పాట్లు చేశారు కూడా. కాగా, బర్త్ డే సందర్భంగా పవన్ అభిమానులకు మేకర్స్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆ రోజున ‘హరి హర వీరమల్లు’తో పాటు ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాల నుంచి అప్ డేట్స్ ఇవ్వబోతున్నారని సమాచారం. అలా పవన్ కల్యాణ్ సినిమాల వరుస అప్ డేట్స్ తో పాటు ‘జల్సా’ ఫిల్మ్ ను రీ-రిలీజ్ చేయబోతున్నారని తెలుసుకుని పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ ప్రజెంట్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో త్వరగా సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్.

పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ కు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీ శ్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’పిక్చర్ లో పవన్ ..ప్రొఫెసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రాలతో పాటు పవన్ కల్యాణ్..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ మూవీ చేయనున్నారు. ఈ పిక్చర్ కు వక్కంతం వంశీ స్టోరి అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ గత చిత్రం ‘భీమ్లా నాయక్’బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది.ఆ సినిమా మాలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు అఫీషియల్ తెలుగు రీమేక్.

 

Read more RELATED
Recommended to you

Latest news