హీరో కిచ్చా సుదీప్ కి మాతృవియోగం

-

కన్నడ సినీ సూపర్ స్టార్  కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిచ్చా సుదీప్
అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈరోజు  ఆమె ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. తన తల్లి అకాల మరణంతో నటుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కిచ్చా సుదీప్ తల్లి వయస్సు 83 సంవత్సరాలు. వయసు పెరగడం వల్ల కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. నటుడి తల్లికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని.. దాని కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారని సమాచారం. అయితే వైద్యసేవలు అందిన కోలుకోలేక మరణించారు.

సుదీప్  తల్లి మృతదేహాన్ని అక్టోబర్ 20, 2024న ఆసుపత్రి నుంచి  JP నగర్ ఇంటికి తీసుకురానున్నారు.  తన తల్లి చివరి వీడ్కోలు కోసం నటుడి ఇంట్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ,
కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు నివాళులర్పిస్తారు. దీని తరువాత, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విల్సన్ గార్డెన్ శ్మశానవాటికలో నటుడి తల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version