ఎన్టీఆర్ కోసం ఈ హీరోయిన్స్ ఏం చేశారో తెలుసా?

-

వెండితెరపైన ఎన్టీఆర్ కనబడితే చాలు..తెలుగు ప్రజలు ఆనందపడిపోతారు. ఆయన నటన చూసి చప్పట్లు కొడతారు. తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా సీనియర్ ఎన్టీఆర్ కు అంతటి ఆదరణ ఉంది. పౌరాణిక, సాంఘీక, జానపద చిత్రాలు చేసి ఎన్టీఆర్..తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నారు.

ఇక ఫిల్మ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ క్రమశిక్షణతో మెదిలేవారు. టైమ్ అంటే ఆ టైమ్ కు వచ్చి దర్శకుడు చెప్పినట్లు నడుచుకునేవారు. ఎన్టీఆర్ తో సినిమా అనగానే నటీ నటులు అందరూ హ్యాపీ గా ఫీలయ్యే వారట. దాంతో పాటు జాగ్రత్త పడేవారు. టైమ్ కు సెట్ కు వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకునే వారట.

ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి మాత్రం పండుగ వాతావరణం నెలకొనేదట. మూవీ యూనిట్ సభ్యులు అందరూ కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసేవారు. అయితే, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చివరి రోజున ప్రొడక్షన్ హౌజెస్ హీరో, హీరోయిన్లకు ప్రత్యేకమైన ట్రీట్ ఇచ్చేవారు. దాంతో పాటు ఎన్టీఆర్ కోసం హీరోయిన్స్ ప్రత్యేకంగా ఫుడ్ వండించుకుని తీసుకొచ్చేవారట. భోజనప్రియుడైన ఎన్టీఆర్ కోసం స్వయంగా భోజనప్రియురాలైన మహానటి సావిత్రి..చేపల పులుసు, రొయ్యలు పీతలు, నాటు కోడితో పాటు రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చేవారట. అలా వారిరువురు కలిసి భోజనం చేసేవారట.

వాణి శ్రీ సైతం ఎన్టీఆర్ కోసం సెపరేట్ గా వంటకాలు చేసుకుని సెట్ కు తీసుకొచ్చి పెట్టే వారట. నిర్మలమ్మ కూడా అలా చేసేవారట. అయితే, ఇది ఒక ఆనవాయితీగా కొందరు హీరోయిన్లు పాటించేవారు. శారద సైతం కొన్నాళ్లు ఇలా ఎన్టీఆర్ కోసం ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయించుకని తీసుకొచ్చిందట. ఇక భోజన ప్రియుడైన ఎన్టీఆర్ ఆ వంటకాలను ఆరగించేవారట.

Read more RELATED
Recommended to you

Latest news