రోజూ నా భర్తతో అది ఉండాల్సిందే – హన్సిక బోల్డ్ కామెంట్స్..!

-

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. చూడ చక్కని మోముతో పాల బుగ్గల తో అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే యువత ఈమెకు ఫిదా అయిపోయారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె పలు చిత్రాలలో నటించి ఆపిల్ బ్యూటీగా పేరు కూడా దక్కించుకుంది.

అంతేకాదు ఈమెపై అభిమానంతో తమిళ తంబీలు ఏకంగా తమిళనాడులో ఈమె కోసం గుడి కూడా కట్టించారు అంటే ఎంతలా ఈమె క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల తాను ప్రేమించిన సోహెల్ ఖతూరియాను గ్రాండ్గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రొఫెషనల్ వర్క్ కి కొంచెం దూరంగా ఉందని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోషూట్స్ తో కుర్ర కారుమతి పోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో బయట పెట్టింది. నా మ్యారీడ్ లైఫ్ చాలా సంతోషంగా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ముఖ్యంగా నా భర్త చాలా మంచివాడు. అతడిని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం నా అదృష్టం.. నాకు వెబ్ సిరీస్ అంటే చాలా చాలా పిచ్చి. ఒక్కసారి వెబ్ సిరీస్ నచ్చింది అంటే నైట్ మొత్తం నిద్రపోకుండా ఆ సీరీస్ కంప్లీట్ చేస్తాను. అంతేకాదు రోజు రాత్రి నాతో పాటు నా భర్తను కూడా ఆ సీరీస్ చూడమని బలవంతం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలిసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version