ఇండియన్ 2: ఆకట్టుకుంటున్న కమలహాసన్ కొత్త లుక్..!

-

ఇండియన్ 2: ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ 2 సినిమాను త్వరలోనే విడుదలకు సిద్ధం చేయడానికి కమలహాసన్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి తాజాగా ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.. ఇందులో కమలహాసన్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇప్పటికే ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని ఈ సినిమా పైన పెట్టినట్లు తెలుస్తోంది.

దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇక దాంతోనే ఇప్పుడు ఇండియన్ 2 సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే శంకర్ ఈ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారని చెప్పాలి. ఒకవైపు రాంచరణ్ తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తూనే.. మరొకవైపు ఈ ఇండియన్ 2 సినిమాని కూడా ఆయన తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ టు నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేయగా కమలహాసన్ కి సంబంధించిన మరో లుక్కుని కూడా ఇప్పుడు తాజాగా విడుదల చేశారు. ఆ పోస్టర్లో కమలహాసన్ ఖాకీ దుస్తులు ధరించి.. చొక్కా జేబు పై మూడు రంగుల జెండా బ్యాడ్జిని ధరించారు. ఇక దేశభక్తి ఉట్టిపడేలా పోస్టర్ ఉండడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version