అతడి వల్లే అల్లు కోడలిగా శ్రీజ వెళ్లలేకపోయిందా..?

-

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వల్ల మెగా అమ్మాయిలకు పెళ్లిళ్లు అసలు కలిసి రావడం లేదు అని తెలుస్తోంది. ఇటీవల నాగబాబు కూతురు నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి రెండో కూతురు శ్రీజ కూడా రెండో భర్తకు విడాకులు ఇచ్చి తన తండ్రితోనే కలిసి ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె తన తండ్రి దగ్గర ఉన్న మాట వాస్తవమే అయినా భర్తకు విడాకులు ఇచ్చింది అన్న విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరొకవైపు చిరంజీవి పెద్ద కూతురు సుస్మితను ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది కానీ వివాహం మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి మరో వ్యక్తిని చూసి సుస్మితాకు ఇచ్చి పెళ్లి జరిపించారు.

ఇకపోతే మెగా ఫ్యామిలీతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న కుటుంబాలలో అల్లూ ఫ్యామిలీ కూడా ఒకటి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో నటుడిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తెను చిరంజీవికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత అల్లు, మెగా ఫ్యామిలీ ల బంధం మరింత బలపడింది. ఈ క్రమంలోనే వీరి బంధాన్ని మరింత బలం చేసుకోవడానికి శ్రీజ పుట్టగానే అల్లు ఇంటికి కోడలు చేయాలి అని చిరంజీవి, అల్లు అరవింద్ మాట్లాడుకున్నారట. అయితే ఈ విషయాన్ని వారిద్దరూ జీవితంలో స్థిరపడిన తర్వాతనే చెప్పాలని నిర్ణయించుకున్నారు.

కానీ శ్రీజ మాత్రం తాను ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయి.. అల్లు వారి కోడలిగా కాలేక పోయింది. ఇకపోతే మొత్తానికైతే తాను ప్రేమించిన వ్యక్తి కోసం ఒక మంచి జీవితాన్ని కోల్పోయింది శ్రీజ. తన కుటుంబం పరువు తీసినటువంటి శ్రీజా పట్ల ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా రెండో పెళ్లి కూడా చేశారు చిరంజీవి అయినా కూడా ఆమె తన భర్తతో విభేదాలు పెట్టుకొని విడిపోయినట్లు సమాచారం. ఏది ఏమైనా శ్రీజను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇచ్చి వివాహం చేయాలనుకున్న చిరంజీవి తన కోరికను మొదట్లోనే తుంచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version