సల్మాన్ ఖాన్ ఒక రోజు సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!!

-

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో అయినా హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్ భారీ గానే పుచ్చుకుంటున్నారు. ఇక సినిమా సినిమాకి తమ రేంజ్ పేరిగి పోతూ ఉంటుంది. అంతేకాకుండా స్టార్ డం ఉన్నప్పుడే అంతో ఇంతో వేనక వేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అలా కొంతమంది బుల్లితెర షో లో హోస్టులుగా, యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఇలాంటి వారు ఎక్కువగా కొనసాగుతోంది అక్కడ స్టార్ హీరోల సంపాదన ఈ విషయంలో అందరి కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.ముఖ్యంగా కండలవీరుడు గా పేరు పొందిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మూడు చిత్రాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ సీజన్లకు హోస్టుగా కూడా వ్యవహరించాడు. చిరంజీవి తో కూడా గాడ్ ఫాదర్ చిత్రం లో కనిపించబోతున్నాడు సల్మాన్ ఖాన్. అలాగే వెంకటేష్ తో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు గా గత నెలలో వార్తలు వినిపించాయి. ఇక సల్మాన్ ఖాన్ ప్రతిరోజు సంపాదన తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే.

బిగ్ బాస్ షో కి హోస్టుగా చేస్తున్నప్పుడు సల్మాన్ఖాన్ వారానికి రూ.20 కోట్ల రూపాయలు అనుకుంటున్నట్లుగా సమాచారం. దాదాపుగా 14 వారాలకి.. రూ.280 కోట్ల రూపాయలు అనుకుంటున్నట్లు సమాచారం. అయితే వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. ఇక సినిమాలలో కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటాడు. ఈ లెక్క ప్రకారం ప్రతి రోజు కూడా సల్మాన్ఖాన్ దాదాపుగా రూ.2.8 కోట్ల రూపాయల పైనే ఉంటుంది అన్నట్లుగా సమాచారం. ఈ ప్రకారం చూస్తే సల్మాన్ఖాన్ ఆస్తి విలువ భారీగానే ఉంటుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version