Pushpa 2 : పుష్ప-2లో జగపతిబాబు?

-

2021 లో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. సమంత స్పెషల్ సాంగ్ లో అలరించిన చిత్రం పుష్ప.. ఇందులో సునీల్, అజయ్, అనసూయ తదితరులు నెగిటివ్ రోల్ పోషించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మొదటి సినిమా భారీ సక్సెస్ పొందడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ‘పుష్ప: ది రూల్’ మూవీలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపటి నుంచి 20 రోజులు పాటు విశాఖ షిఫ్ట్ యార్డ్, పోర్టు ఏరియాలో మూవీ షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాదులో మొదలయ్యే భారీ షెడ్యూల్ లో జగపతిబాబు పాల్గొంటారని తెలుస్తోంది. అతని క్యారెక్టర్ వివరాలను చివరి వరకు సస్పెన్స్ లో పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news