అసలైన టిడిపి వారసుడు జూనియర్ ఎన్టీఆరే..!

251

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో చంద్రబాబు అసలు స్వరూపం ఇది అని చూపించే ప్రయత్నం చేసిన ఆర్జివి. తాను ఎన్.టి.ఆర్ అసలు కథ చెప్పాను తప్ప అందులో తానెవ్వరిని టార్గెట్ చేయలేదని అన్నాడు. ఎన్నో వివాదాలతో ఆ సినిమా వచ్చింది ఏపిలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.

ఇక లేటెస్ట్ గా వర్మ టిడిపికి అసలైన వారసుడు జూనియర్ ఎన్.టి.ఆరే అంటూ సంచలన కామెంట్స్ పెట్టాడు. నిజమైన, నిజాయితీ గల సీనియర్ ఎన్.టి.ఆర్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ చూసిన తర్వాత ఓటు వేయాలని అన్నారు. టిడిపి వారసుడు లోకేష్ కాదు జూనియర్ ఎన్.టి.ఆరే అసలైన వారసుడని ట్విట్టర్ లో కామెంట్స్ పెట్టాడు ఆర్జివి. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ పై సంబరపడుతున్నా టిడిపి ఫాలోవర్స్ గరం గరంగా ఉన్నారు.