జూన్‌ 9న వరుణ్‌ తేజ్‌-లావణ్యల ఎంగేజ్‌మెంట్‌ ?

-

హీరో వరుణ్ తేజ్ మెగా హీరోలలో ఒకరు. అయితే..టాలీవుడ్ నటి లావణ్య త్రిపాటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తన పుట్టినరోజు సందర్భంగా 25 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ పట్టుకొని బెంగళూరులో ఉన్న లావణ్య త్రిపాఠి వద్దకు వెళ్లారంటూ కూడా జోరుగా వార్తలు వినిపించాయి.

మరోవైపు త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా వీరి పెళ్లి గురించి ఓ ఆసక్తికర అప్డేట్‌ వచ్చింది. లావణ్య త్రిపాటి, వరుణ్‌తేజ్‌ ల ఎంగేజ్‌ మెంట్‌ ఈ నెల 9వ తేదీన జరుగనుందని టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హైదరబాద్‌ లో ఓ ప్యాలెస్‌ లో వీరి… ఎంగేజ్‌ మెంట్‌ జరుగనుందని సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version