‘విక్రమ్’ ప్రమోషన్స్‌కు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ దూరం..కారణం అదేనా?

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ (ఫఫ) కీలక పాత్రలు పోషించారు. కాగా, వీరిరువురు సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు.

వారు ప్రస్తుతం తమ నెక్స్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ ‘ఒకే ఒక్కడు’ మాదిరిగా అన్ని చోట్లకు ఒక్కడే వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నాడు.

పాన్ ఇండియా ప్రమోషన్స్ ను కమల్ హాసన్ చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాను ప్రమోట్ చేశాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ముందుకు సాగుతున్నాడు.

తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ చిత్రంలో సూర్య కూడా కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ..ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితం. ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతి నటించగా, ‘పుష్ప’ ఫిల్మ్ లో ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news