కాంచన 3 రివ్యూ : రొటీన్‌ కాంచన సిరీస్‌ హర్రర్‌ కామెడీ

-

ముని, కాంచన, కాంచన2 హర్రర్‌ కామెడీ చిత్రాలతో సక్సెస్‌ కొట్టిన రాఘవ లారెన్స్‌ ఇప్పుడు కాంచన ౩తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కూడా లారెన్స్‌ డ్యుయల్‌ రోల్‌ చేశాడు.. కాంచన సిరీస్‌లన్నీ హిట్‌ కావడంతో కాంచన ౩ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా.లేదా..? కాంచన 3 కథ ఏంటి..?

సినిమా : కాంచన 3
నటీనటులు : రాఘవ లారెన్స్‌, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి తదితరులు..
దర్శకత్వం : రాఘవ లారెన్స్‌
నిర్మాతలు: ఠాగూర్ మధు
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : ఏప్రిల్ 19, 2019
కథ
కాళీ (రాఘవ లారెన్స్‌) తల్లి అనాథ శరణాలయాన్ని నడుపుతూ నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తుంటుంది. రాఘవతో పాటు రోజీ మరో ఇంగ్లీష్‌ పిల్లను కూడా పెంచుకుంటుంది రాదమ్మ. తోటి వారి కడుపు నింపితే మన కడుపు ఆ దేవుడే మన కడుపు నింపుతాడని బలంగా నమ్మే వ్యక్తి రాదమ్మ. ఒక రోజు హఠాత్తుగా రాదమ్మ చనిపోవడంతో, ఆశ్రమం బాధ్యతలు కాళీ తీసుకుంటాడు. పెరిగి పెద్దయ్యాక మినిస్టర్ శంకర్ తమ్ముడైన భవానీతో కాళీ గొడవ పడతాడు. తన ఈగో హర్ఠ్‌ చేసిన కాళీని ఎలాగైనా చంపాలనుకుంటాడు శంకర్‌.. ఈ క్రమంలో శంకర్‌ని కాళీ చంపడం.. కాళీ నడిపిస్తున్న ట్రస్ట్‌ని తగులబెట్టి, కాళీని, రోజీని చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తాడు మినిస్టర్‌.. చనిపోయిన కాళీ, రోజీలు ప్రేతాత్మలుగా మారి ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా కథ..

నటీనటలు

లారెన్స్‌ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల్లో వైవిద్యంగా నటించాడు. తనదైన అమాయకత్వాతో కూడిన కామెడీ. డాన్స్ , భయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ లు మంచి నటనతో ఆకట్టుకున్నారు. కామెడీ సీన్స్‌లో వీరి నటన సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా దెయ్యం ఇంట్లో ఉందా? లేదా? అని కని పెట్టే సన్నివేశాల్లో కామెడీ థియేటర్స్ లలో నవ్వులు పోయించింది. వేదిక, ఓవియా, నిక్కీ తంబోలిలకు నటించేందుకు పెద్దగా ఆస్కారంలేకుండా పోయింది. హీరోయిన్లు పేరుకు ముగ్గురున్న కేవలం పాటలకు మాత్రమే పరిమితమయ్యారు. విలన్‌ పాత్రలో నటించిన కబీర్ దుహన్ సింగ్‌ నటన చాలా బాగుంది. తెలుగు పరిశ్రమకు మంచి విలన్‌ దొరికాడు.

డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎదిగిన రాఘవ లారెన్స్‌ మునితో హరర్‌ బాట పట్టాడు. ముని సిరీస్‌లో వరుసగా కాంచన , గంగ(కాంచన 2) సినిమాలతో యాక్టర్‌గా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. దర్శకత్వం పరంగా పర్వాలేదు కానీ కథ పై ఇంకాస్త కష్టపడి ఉంటే బాగుండుననిపిస్తుంది. యాక్షన్ సీన్లపై పెట్టిన శ్రద్ధ.. హారర్ సీన్లపై పెట్టలేకపోయాడు.. తనకు అన్యాయం చేసిన వాడిని చంపడమే ధ్యేయంగా సినిమా సాగుతుంది. దెయ్యానికి దేవుడు సహాయం చేయడం ట్విస్ట్‌,, మొత్తంగా గత సినిమాలను చూసిన ఫీలింగే కలుగుతుంది తప్ప..కొత్త గా చూసిన ఫీలింగ్ రాదు.

ప్లస్‌

హర్రర్ కామెడీ
రాఘవ యాక్టింగ్
కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోశాయి

మైనస్‌

కొత్తదనం లేని కథా కథనం
తమిళ వాసనలు ఉండటం
మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉండటం
ఫస్ట్ హాఫ్ బాగా స్లో గా సాగింది.

బాటమ్‌ లైన్‌

రొటీన్‌ కాంచన సిరీస్‌ హర్రర్‌ కామెడీ ..

చివరగా

హారర్‌తో కూడిన కామెడీని ఇష్టపడే వారు కాంచన-3 చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news