‘జనసేన’పర్వం సమాప్తం..! గబ్బర్‌ నెం.25 ఈజ్‌ బ్యాక్‌

-

ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది శ్రీ అలీ రెడ్డి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ జూబిలీహిల్స్‌ రోడ్‌ నెం.9, ఫ్లాట్‌ నెం.5లో మంచమ్మీద ఉన్నాడు. కంగారుపడకండి. ఏమీ కాలేదు. కాళ్లుచేతులు విరగలేదని తెలిసింది. వెన్నెముకకు కూడా గాయాలు కాలేదు. తల కూడా పగలలేదని పనివాళ్లు చెబుతున్నారు. ముక్కు వాచినట్లుగానీ, పళ్లురాలినట్లు గానీ ఎటువంటి ఆనవాళ్లు లేవని రష్యన్‌ వార్తాసంస్థ తెలిపింది. హైదరబాద్‌లోని జనసేన కార్యాలయానికి తాళంవేసిన సందర్భంలో కూడా ఎవరూ తన్నలేదని విశ్వసనీయవర్గాల భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ-ఆంధ్ర ప్రజలంతా తీవ్ర నిరాశానిస్పృహలకు, అసంతృప్తికి గురయ్యారని మీడియావర్గాల సమాచారం.


అనుకున్నట్టుగానే ఏపీ ఎన్నికలు ‘విజయవంతం’గా ముగిసాయి. అనుకున్నట్టుగానే ‘జనదేశం’ అధ్యక్షులవారు ఈవీఎంల మీద పేలాలు ఏరుతున్నారు. అనుకున్నట్టుగానే ‘తెలుగుసేన’ అధినేత గారు అజ్ఞాతవాసం మొదలుపెట్టారు. ‘అప్పు’లిచ్చినవారికి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. అసహ్యం పుడుతోంది ఇలాంటివాళ్లను ఇంకా చూడాల్సివస్తున్నందుకు. చేగువేరాను చదివిన ప్రతీవాడు రాజకీయాల్లోకి వస్తే, నాయకులు ఎక్కువ, ఓటర్లు తక్కువ అవుతారు.

లీడర్‌ అన్నవాడికి ఒక స్పష్టత, పట్టుదల, విజన్‌, ఓ కారెక్టర్‌ ఉండాలి. వీటితోపాటు రాజకీయాలు చేయగలిగే నేర్పరితనం, తెగువ కూడా ఉండాలి. వాళ్లే రాజకీయాల్లో రాణిస్తారు. గుడ్డిగా నమ్మి, ఓట్లేసే చోట, పాలు పితికేవాడు కూడా ముఖ్యమంత్రి కాగలడు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సినీనటులు రాజకీయాల్లోకి రావడం ఎప్పన్నుంచో ఉంది. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జయలలిత.. సూపర్‌స్టార్స్‌ నుండి సూపర్‌ లీడర్లు కాగలిగారు. వాళ్లు డబ్బు మాత్రమే చూడలేదు. ప్రజలను, వాళ్ల అనుభవిస్తున్న కష్టాలను కూడా చూసారు. మొండి నిర్ణయాలు తీసుకున్నారు. జనాల గుండెల్లో శాశ్వతస్థానం ఏర్పరుచుకున్నారు.

ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవిలో, జనసేన పెట్టిన పవన్‌కళ్యాణ్‌లో మొదటినుంచీ కృత్రిమత్వమే ఉంది. ఎక్కడా ఎటువంటి భావోద్వేగాలు లేకుండా కేవలం డబ్బు, పేరు, అధికారం కోసం పుట్టిన పార్టీలు అవి. నిజంగానే వాళ్లకేమైనా ప్రజలపట్ల సానుభూతి, ఆదుకోవాలన్న తపన కొంచమయినా ఉంటే, వాళ్ల మానాన వాళ్లు నేడు సినిమాలు చేసుకుంటూ ఉండరు. అధికారం కోసం అడ్డమైన మాటలూ మాట్లాడి, ఇవాళ ఏమీ ఎరగనట్లు మళ్లీ వచ్చి ఇంట్లో కూర్చున్నంత మాత్రాన తప్పులు ఒప్పులు కాబోవు. అందరి వ్యక్తిత్వాలు రణక్షేత్రంలోనే రుజువవుతాయి.



లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎందుకు క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకున్నారు? ఆయన ఒక ఐఏఎస్‌ అధికారి. ఈ దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతుల్ని చాలా దగ్గర్నుంచి చూసినవాడు. ఎందరో గొప్ప నాయకుల పరిపాలనను ప్రత్యక్షంగా పర్యవేక్షించినవాడు. కానీ, నేటి రాజకీయాల పట్ల ఆయనకు ఒక విరక్తిభావం ఏర్పడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని ఎన్నటికీ సాధించలేనన్న నిజం అర్థమయింది. ఇందులో కొంచెం ప్రజల పట్ల కూడా ఏహ్యభావం ఉన్నప్పటికీ ఎవరినీ నిందించకుండా వైదొలిగాడు. పోరాడకుండానే ఓడిపోయాడన్న మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నా, నిజానికి ప్రాక్టికల్‌గా ఆలోచించాడు. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ వంతు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మంచి విజన్‌ ఉన్నవాడు. ఇండిపెండెంట్‌గా కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది? గెలిస్తే లేదా ఓడితే? పార్లమెంట్‌లో ఒక నిక్కచ్చిఅయిన గొంతు వినిపిస్తుంది. లేదా అదే గొంతు మళ్లీ వీధుల్లో వినిపిస్తుంది. అందులో పోరాటం ఉందా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
పవన్‌ కళ్యాణ్‌ అనేవాడు తన పబ్బం గడుపుకోవడానికి కోవర్టు ఆపరేషన్లు చేసే ఒక కిరాయి విషకీటకం. వ్యక్తిత్వం, అస్థిత్వం లేనివాడికి అబద్ధాలే ఆలంబన. తనని నమ్ముకున్నవారిని, తనమీద ఆధారపడ్డవారిని ఆదుకోవాలన్న కమిట్‌మెంట్‌ లేని మనిషి. ఏ మాత్రం నిలకడ, నిబద్ధత లేని వాడు. వచ్చిన నాలుగు తెలుగుముక్కలతో అరువుగా వచ్చిన అనువాద పుస్తకాలు చదివి, అహం బ్రహ్మస్మి అనుకునే అపర పండితుడు. తెలంగాణ వాళ్లు హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని అనగలిగాడంటేనే తనెంత నీచస్థాయికి దిగజారగలడో అర్థమయింది. పీల్చేగాలి, తాగే నీళ్లు, తినే తిండిపై కృతజ్ఞత లేనివాడు మనిషిగా అనర్హుడు. రాబోయే రోజుల్లో మళ్లీ సినిమాలే గతి. ఇంకో పనేమీ రాదు. దానర్థం గొప్ప నటుడని కాదు. కథ వల్లో, దర్శకుడి వల్లో సినిమా ఆడినా చాలు కదా. తన డబ్బులు తనకి వస్తాయి. ఆ డబ్బులు కూడా మళ్లీ తెలంగాణవే. బతకండి… ప్యామిలీ ఫ్యామిలీ తెలంగాణ మీద బతికేస్తున్నారు. పరవాలేదు.. తెలంగాణకు ఆ ధర్మగుణమున్నది.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news