గుంటూరు కారం నుంచి ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది. చాలా కాలం తర్వాత మహేశ్ పక్కా మాస్ యాక్షన్ మూవీ చేస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ గుంటూరు కారం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీని మడతపెట్టి’ అంటూ మాస్ బీట్‍తో మంచి ఊపున్నసాంగ్  తాజాగా విడుదల అయింది.

గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీని మడతపెట్టి’ అంటూ ఈ మూడో పాట వచ్చేసింది. ఈ సాంగ్‍కు మంచి ఊపున్న మాస్ బీట్‍ను సంగీత దర్శకుడు ఎస్.థమన్ అందించారు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ ఈ సాంగ్‍ను పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‍కు హీరో మహేశ్ బాబు, హీరోయిన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్‍లు అదిరిపోయాయి. ఆ ఇద్దరు డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. గుంటూరు కారం సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణలా కనిపిస్తోంది. “రాజమండ్రి రాగమంజరి.. మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రీ.. కళాకారుల ఫ్యామిలీ మరీ.. మేగజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి” అంటూ ఈ సాంగ్ మొదలైంది. “ఆ కుర్చీని మడతపెట్టి” అంటూ డీజే సాంగ్‍లా ఈ పాట ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version