మహానాయకుడితోనే వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్..!

-

ఎన్.టి.ఆర్ మహానాయకుడు ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 22న ఎన్.టి.ఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాకు పోటీగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది. మహానాయకుడు రిలీజ్ డేట్ ను చూసుకుని లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ వదులుతానని చెప్పిన వర్మ. అన్నట్టుగానే అలా సినిమా 22న రిలీజ్ అని తెలియగానే ఆ సినిమా ఆడే థియేటర్స్ లోనే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఫిబ్రవరి 14 ఉదయం 9:27 గంటలకు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అయితే మహానాయకుడు ఆడే థియేటర్స్ లో కూడా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అసలే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై నందమూరి ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతుంటే వారిని మరింత రెచ్చగొట్టేలా ఆ సినిమా ట్రైలర్ మహానాయకుడులో వేస్తున్నాడు వర్మ. సినిమా పబ్లిసిటీలో పి.హెచ్.డి చేసిన ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో సినిమా రిలీజ్ కు ముందే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news