సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెకండ్ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్‌ హీరో. అయితే… సుధీర్‌ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. ఇద్దరి కలయికలో వచ్చిన సమ్మోహనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన వి ఓటీటీలో రిలీజ్‌ అయింది. అయితే.. ఇందులో సుధీర్‌ బాబును ప్యాక్డ్‌ బాడీలో చూపించిన విధానం అందరికీ నచ్చింది.

 

ఇప్పుడు వీరి కాంబినేషన్‌ లో రూపొందితున్న మూడో సినిమానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇందులో హీరో సుధీర్‌ బాబు సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్ర ఇదే కావడం గమనార్హం. అయితే.. ఇప్పటికే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, సాంగ్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ  సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది. MeereHeroLaa అనే సాంగ్‌ ను తాజాగా రిలీజ్‌ చేసింది. కాగా సెప్టెంబర్ 16 వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ఇటీవల పేర్కొంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version