అందాలు ఆరబోసి కుర్రకారుకు మత్తెక్కిస్తూ..ధ్రువతారలా మెరిసిపోతున్న మెహ్రీన్..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ ప్రజెంట్..F3 ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ‘హనీ ఈజ్ గ్రేట్’ అనే డైలాగ్ తో పాటు తనదైన అభినయం, కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలో ఆకట్టుకుంది ఈ సుందరి. గతంలో బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల కాలంలో సన్నబడింది.

చక్కనమ్మా చిక్కితే ఇంకా అందంగా ఉంటుందన్నట్లు ..జీరో సైజ్ కు వచ్చేసింది ఈ అమ్మడు. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సిల్వర్ కలర్ డ్రెస్సులో అలా అందాలు ఆరబోసి..కుర్రకారుకు పిచ్చె్క్కిస్తోంది. ధ్రువతారాలాగా ఆ డ్రెస్సులో మెరిసిపోతున్నది ఈ సుందరి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్, బ్యూటిఫుల్ హీరోయిన్, వెరీ హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రాల్లో కథానాయికగా ఈమెకు మంచి పేరు వచ్చింది. ‘రాజా ది గ్రేట్’ తో పాటు ‘F2, F3’ సినిమాల్లో మెహ్రీన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న మెహ్రీన్..త్వరలో బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news