బేబీ బంప్‌ను కవర్ చేస్తున్న ఆలియా భట్..? ఫొటోలు వైరల్..

-

బీ టౌన్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. RRR ఫిల్మ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆలియా భట్.. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ లోనూ సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్ మీరో రణ్ బీర్ కపూర్ ను మ్యారేజ్ చేసుకుంది.

రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ మ్యారేజ్ ఘనంగా జరిగింది. వీరిరువురు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. ఆలియా భట్ తాను తల్లి కాబోతున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, అది నిజమేనా? కాదా? అని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, చాలా మంది నిజమే అని అంటున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఆలియా భట్ ఫొటోలు వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో ఆలియా భట్..తన బేబీ బంప్ కనబడకుండా ఉండేందుకు కవర్ చేసుకుంటున్నదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రీగా ఉండే పింక్ కలర్ డ్రెస్సు ధరించిన ఆలియా భట్ …త్వరలో తల్లి కాబోతున్నదని అంటున్నారు. అయితే, ఆలియా భట్ మాతృత్వం విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

ఆలియా భట్ సినిమాల విషయానికొస్తే.. తన భర్త రణ్ బీర్ కపూర్ తో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నది. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ కానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలోనూ ఆలియా భట్ నటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news