నాగార్జున “ది ఘోోస్ట్” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న “ది గోస్ట్” చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు ది గోస్ట్ అనే టైటిల్ పెట్టి క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర కు సంబంధించి జూలై 9న ఫస్ట్ విజువల్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ లుక్ లో కనిపిస్తున్న నాగ్ పోస్టర్ను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతుంది అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version