జాతీయ జెండాతో స్పెయిన్ లో సందడి చేస్తున్న నయన్ దంపతులు. ఫోటో వైరల్..!!

-

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ నయనతారకు సూపర్ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇక గత కొన్ని రోజుల క్రితం నయనతార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నది. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి డైరెక్టర్, నిర్మాత విగ్నేష్ శివన్ తో ఈమె ప్రేమలో ఉన్నది.ఇక ఎట్టకేలకు తను ప్రేమించిన వాడిని జూన్ 9 వ తేదీన వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నది. ఇక వీరి వివాహం జరిగినప్పటి నుంచి వీరిద్దరూ ఏ మాత్రం ఖాళీగా లేకుండా పలు ప్రాంతాలకు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ జంట ఇప్పుడు స్పెయిన్ లో సందడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక విగ్నేష్ శివన్ కూడా స్పెయిన్ కి వెళుతున్నట్లు తన సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇక అలాగే బార్సిలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఇక ఆగస్టు 15 వేడుకలను ఈ జంట స్పెయిన్ లో జాతీయ జెండాను అక్కడ ప్రదర్శించి చాలా సందడి చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక దీంతో వీరి అభిమానులు దేశభక్తిని స్పెయిన్ లో కూడా వీరు చాటుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరు షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇక అంతే కాకుండా ఒక వీడియోను కూడా తన ఇంస్టాగ్రామ్ లో నుంచి పోస్ట్ చేయగా.. ఆ వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం నయనతార సినిమాల విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిస్తున్న జవాన్ చిత్రంలో నటిస్తున్నది. చివరిగా నయనతార KRK సినిమాలో నటించింది ఈ సినిమా మిశ్రమ స్పందన లభించింది. తెలుగులో కూడా మరికొన్ని సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version