పుష్ప 2 లో మెగా డాటర్ నిహారిక..!

-

మెగా డాటర్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని దేశవ్యాప్తంగా నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కేవలం దక్షిణాదిని మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి అత్యంత అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండవ భాగం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర వేగంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అందుతుంది.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాలో గిరిజన యువతి పాత్ర కొరకు సాయి పల్లవని సంప్రదించినట్టు కానీ ఆమె ఆ పాత్రను తిరస్కరించినట్టు తెలుస్తోంది. కాగా ఈ పాత్ర కొరకు సాయి పల్లవి ప్లేస్ లో మెగా డాటర్ నిహారిక కొణిదలను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. సాయి పల్లవి కాదన్నా అనంతరం నిహారికను ఈ పాత్రలకు సంప్రదించారని ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. పెళ్లి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ తో అభిమానుల్ని అలరిస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న నిహారిక ప్రస్తుతం మళ్ళీ సినిమాలు పై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది.

కాగా 2021 లో వచ్చిన పుష్ప సినిమా దాదాపు 180 కోట్లతో తెరకెక్కి మొదటి భాగం 400 కోట్లకు పైగా వసూలు సాధించి దక్షిణాదిన అత్యంత పెద్ద విజయాలను ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు రాబోతున్న పుష్పా 2 చిత్రం విడుదల చేసిన టీజర్ తో అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో సైతం అల్లు అర్జున్ మాస్క్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version