అలాంటి వాళ్లు దొరికితే పెళ్లి చేసుకుంటా : నిత్యామీనన్

-

టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నిత్యా. మొదటి సినిమాతో భారీ హిట్ ను అందుకొని వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గ్లామర్, అందాల ఆరబోత లేకుండా స్టార్లు అవలేరని అనుకుంటున్నా జనరేషన్ లో అవేమి లేకుండానే.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరి మన్ననలు పొందింది.

ఇక తెలుగు లోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న నిత్యా..ఇటీవల కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే, పెళ్లి విషయంలో తనకు స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయని హీరోయిన్ నిత్యమీనన్ తెలిపారు. పెళ్లి అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్ అన్నారు. తనకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదని, ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్ళు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు. నిత్య నటించిన ‘కుమారి శ్రీమతి’ ఇటీవల విడుదల కాగా… త్వరలో మరో వెబ్ సిరీస్ ‘మాస్టర్ పీస్’ రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version