ఎన్టీఆర్ నెక్ట్స్ త్రివిక్ర‌మ్‌తోనా?

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ లో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ మ‌రో హీరో. స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు కొమురం భీమ్‌, అల్లూరిసీతారామ‌రాజు యుక్త వ‌య‌సులో ఎక్క‌డికి వెళ్ళారు? ఏం చేశార‌నేది క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ గ‌తేడాది త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత చేశాడు. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్ర‌మ‌ది. క‌థ ప‌రంగా అది కాలం చెల్లిన‌ది కావ‌డంతో పెద్ద‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్‌తో ఎలాగోలా హిట్ ఖాతాలో వేశారు. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇది ప‌ర్వాలేద‌నిపించుకుంది. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఎన్టీఆర్ మ‌రోసారి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాడ‌ట‌.

ntr next movie with trivikram?

అంతే కాదు నెక్ట్స్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ త్రివిక్ర‌మ్‌తోనే అని క‌న్ఫ‌మ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. సోమ‌వారం ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్బంగా అభిమానుల‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. మాటామంతిలో భాగంగా త‌న త‌దుప‌రి సినిమా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని వెల్ల‌డించార‌ట‌. అర‌వింద స‌మేత టైమ్‌లో ఆయ‌న టేకింగ్ న‌చ్చి మ‌రో సినిమా త్రివిక్ర‌మ్‌తో చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ లో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ మ‌రో హీరో. స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు కొమురం భీమ్‌, అల్లూరిసీతారామ‌రాజు యుక్త వ‌య‌సులో ఎక్క‌డికి వెళ్ళారు? ఏం చేశార‌నేది క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి అలియా ఫైన‌ల్ అయ్యింది. తార‌క్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఇంకా ఫైన‌ల్ కాలేదు.

గ‌తంలో బ్రిటీష్ న‌టి డైసీ ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేయ‌గా ఆమె మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంది. దీంతో మ‌రో హీరోయిన్‌ని వెతుకుతున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని వ‌చ్చే ఏడాది జులై 30న విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ మ‌రో సినిమా చేసే అవ‌కాశం లేదు. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాతే త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ట‌. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాని రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇది సంక్రాంతికి విడుద‌ల కానుంది.

దీంతో పాటు త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే చిరంజీవికి ఓ క‌మిట్ మెంట్ ఉంది. మ‌రి ఆ సినిమా ఎప్పుడు చేస్తాడు? అలాగే మ‌హేష్‌బాబుకి కొన్ని రోజులుగా ఓ క‌థ చెబుతున్నార‌ట‌. మ‌రి వీటన్నిటినీ ఎప్పుడు చేస్తాడు, ఏదు ముందు చేస్తాడో ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గా మారింది.