ఐదు నెలలు రెండే హిట్లు.. ఇది టాలీవుడ్ పరిస్థితి..!

-

ఎపిక్ హిట్ అంటూ గొప్ప‌ల‌కు పోయిన మ‌హేష్ మహర్షి వంద కోట్లు తెచ్చిందని చెప్పుకున్నా సీడెడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ నష్టాలు తప్పలేదు. మిగిలిన ఏరియాలలో మంచి వసూళ్లు రాబట్టడంతో బ్రేక్ ఈవెన్ అయ్యింది. చివ‌రికి ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన హిప్పీ కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

సినిమా అనేది వ్యాపారం. ఎంత అభిరుచి ఉన్నా అంతిమంగా లాభాలు రావాలనే ప్రతి ఒక్క నిర్మాత కోరుకుంటారు. ఒక్క హీరోకో,  దర్శకుడికో పేరు వస్తే చాలు మాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదని ఎవరూ అనుకోరు. కొన్నిసార్లు ప్యాషన్ ఒక్క సినిమాతో వదిలేయనీయదు. ఒకదాంట్లో పోయింది ఇంకోదాంట్లో వస్తుందన్న నమ్మకంతో ఒక్క సినిమా పోయినా ఇంకో సినిమా కోసం రెడీ అయిపోతారు. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా పూర్తి నిరాశ పరుస్తోంది. ఐదు నెలలు గడిచినప్పటికీ బ్లాక్ బస్టర్ గా చెప్పుకునే సినిమాలు నెలకు ఒక్కటి కూడా లేవు. ఐదు నెలల్లో కేవలం ఒక్క సినిమా ‘ఎఫ్2’ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.

ఆ త‌ర్వాత వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ‌, బాలకృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్‌, అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను, మ‌మ్ముట్టి యాత్ర‌, క‌ళ్యాణ్ రామ్ 118, నిహారిక సూర్య‌కాంతం, రామ్‌గోపాల్ వర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, నాగ‌చైత‌న్య‌ మ‌జిలి, సుమంత్ అశ్విన్  ప్రేమ క‌థా చిత్ర‌మ్ 2, సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి, నాని జెర్సీ, మ‌హేష్ మ‌హ‌ర్షి, అల్లు శిరీష్ ఏబీసీడీ, ఈ నెల‌లో ఆర్స్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ న‌టించిన హిప్పీ, హ‌వీష్ న‌టించిన సెవెన్‌ సినిమాలు వ‌చ్చాయి. వీటిలో యాత్ర ప్ర‌శంస‌లందుకుంది. 118 ప‌ర్వాలేద‌నిపించుకుంది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్ర‌శంస‌లందుకుంది. మ‌జిలి మంచి విజ‌యాన్ని సాధించింది. చిత్ర‌ల‌హ‌రి ప‌ర్వాలేద‌నిపించుకుంది. జెర్సీ ప్ర‌శంస‌ల‌కే ప‌రిమిత‌మైంది. మొత్తం సినిమాల్లో ఎఫ్‌2 మాత్ర‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ కాగా, మ‌జ‌లి హిట్ ఖాతాలో ప‌డింది. మే నెల వ‌ర‌కు 76 సినిమాలు విడుద‌ల కాగా, హిట్‌గా చెప్పుకునే సినిమాలు రెండే కావ‌డం గ‌మ‌నార్హం. సంక్రాంతి సీజ‌న్‌కి ఒక‌టి, స‌మ్మ‌ర్ సీజ‌న్‌కి మ‌రో సినిమా హిట్ అన్న‌ట్టుగా మారింది.

ఎపిక్ హిట్ అంటూ గొప్ప‌ల‌కు పోయిన మ‌హేష్ మహర్షి వంద కోట్లు తెచ్చిందని చెప్పుకున్నా సీడెడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ నష్టాలు తప్పలేదు. మిగిలిన ఏరియాలలో మంచి వసూళ్లు రాబట్టడంతో బ్రేక్ ఈవెన్ అయ్యింది. చివ‌రికి ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన హిప్పీ కూడా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకుని కాంబినేష‌న్‌లు, స్టార్ ఇమేజ్‌ల కంటే కంటెంట్ పై ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు దృష్టి సారించాల‌ని, ఆ దిశ‌గా అడుగులు వేయాల‌ని, మిగిలిన ఏడు నెలల్లో అయినా ఆడియెన్స్‌కి మంచి వినోదాన్ని పంచి, విజ‌యాల‌ను అందుకునే సినిమాలు తీస్తార‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news