మనసున్న మారాజు అన్నయ్య చిరంజీవి – పవన్ కళ్యాణ్

-

మనసున్న మారాజు అన్నయ్య చిరంజీవి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నయ్య.. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదమని… ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుందని తెలిపారు. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

చిరంజీవి జీవితం తెరిచిన పుస్తకమని.. చిరంజీవి ఇంతవాడు అంతవాడైన విషయం చెప్పాలా..? అని పేర్కొన్నారు. చిరంజీవి సాధించిన విజయాలు గురించి చెప్పాలా..? చిరు సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి చెప్పాలా..? చిరంజీవి అధిరోహించిన పదవుల గురించి చెప్పాలా..? అంటూ ఎమోషనల్‌ వ్యాఖ్యలు చేశారు పవన్‌. ఆయన కీర్తిప్రతిష్ఠల గురించి చెప్పాలా..బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో చిరంజీవి రక్త సంబంధం ఏర్పరచుకున్నారని వివరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news