పవన్ కల్యాణ్ మేనియా.. థియేటర్ల వద్ద అభిమానుల సందడే సందడి..

-

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా పలు థియేటర్లలో ఆయన నటించిన ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. అవి చూసి పవన్ అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానుల హంగామా తారాస్థాయికి చేరింది.

ఇలా పవన్ సినిమాలు రీ-రిలీజ్ ద్వారా కూడా రికార్డు వసూళ్లు చేస్తుండటం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ పవన్ సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ప్యారిస్, ఆస్ట్రేలియాతో పాటు పలు చోట్ల విడుదల చేస్తున్నారు. ఇక టాకీసుల వద్ద అభిమానులు ‘జై … పవన్ కల్యాణ్’ అంటూ నినాదాలు చేస్తూ డ్యాన్సులు చేస్తున్నారు.

థియేటర్లో ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాల్లో పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్ చూసి కాగితాలు గాల్లోకి ఎగరేసి అభిమానులు సంతోషపడుతున్నారు. ప్రతీ సీన్ కు హ్యాపీగా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో లు ట్రెండవుతున్నాయి. ఆ గస్టు 31 నుంచి పవన్ కల్యాణ్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు.

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు ’ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news