మరో రీమేక్‌కు పవన్ కల్యాణ్ సై..గ్రాండ్‌గా చిత్ర పూజా కార్యక్రమాలు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. కాగా, అప్పుడే పవన్ మరో రీమేక్ కు ఓకే చెప్పేశారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘వినోదయ సిత్తం’ తెలుగు రీమేక్ కు ఓకే చెప్పారని గత కొద్ది రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రీమేక్ లో కీలక పాత్ర పోషిస్తుండగా, సముద్ర ఖని దర్శకత్వం వహిస్తారని టాక్. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ ఫిల్మ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.