పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ తొలి చిత్రం RX 100తోనే చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో బోల్డ్ రోల్స్ ప్లే చేయగల సత్తా ఈ భామకే ఉందనే టాక్ వచ్చింది. తర్వాత సినిమాల్లో కూడా బోల్డ్ రోల్స్ ప్లే చేసిన పాయల్ రాజ్ పుత్..ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ చిత్రాలు చేస్తోంది.
ఇక సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది ఈ సుందరి. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘లాలా లాలా…..’ అనే క్యాప్షన్ తో సదరు ఫొటోలో సింగర్ మాదిరిగా స్టిల్ ఇచ్చేసింది ఈ సుందరి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ‘లాలా..లాలా భీమ్లా’ అనే క్యాప్షన్ ఇవ్వడం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు లవ్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. రెడ్ కలర్ టాప్, బ్లూ జీన్స్ లో ఉన్న పాయల్ పాప..మైక్ తన తల వద్ద పెట్టుకుని రాక్ స్టార్ మాదిరిగా ఫోజు కొడుతోంది.
ఈ ఫొటోను బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా లైక్ చేయగా, ‘వాహ్..జకాస్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్, సో బ్యూటిఫుల్, నయా బ్యాండ్’ అని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతూనే ఉన్నారు.ప్రస్తుతం ‘కిరాతక’ అనే తెలుగు చిత్రంలో పాటు తమిళ, కన్నడ భాషల చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది పాయల్ రాజ్ పుత్.
https://www.instagram.com/p/CcfHjTAvelq/?utm_source=ig_web_copy_link