కృతి సనన్ తో రిలేషన్ పై స్పందించిన ప్రభాస్.. ఏమన్నారంటే..?

-

తాజాగా బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెలబ్రిటీ టాక్ షో కి ముఖ్య అతిథిగా ప్రభాస్ తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా హాజరయ్యారు. అయితే నిన్న సాయంత్రం వీరి ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేయగా.. ఇప్పుడు ఈ ఎపిసోడ్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. దేశం అంతా ఎక్కడ చూసినా సరే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలయ్య సరదా చిట్ చాట్ ఎపిసోడ్ గురించే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా నెట్టింట రికార్డ్ స్థాయిలో స్పందనతో స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఎపిసోడ్. ఇదిలా ఉండగా ఆది పురుష్ కోస్టార్ కృతి సనన్ తో డేటింగ్ లైఫ్ గురించి అడిగారు బాలయ్య.

ఈ విషయంపై ఎలాంటి వాస్తవం లేదని మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి రిలేషన్ ఏమీ లేదని ఇప్పటికే కృతి సనన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత పెళ్లి డేట్ ప్రకటించడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అయితే ఇదే విషయంపై ఇప్పుడు ఆహా షోలో ప్రభాస్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై ప్రభాస్ మాట్లాడుతూ.. “కృతి సనన్ తో నేను డేటింగ్ చేస్తున్నాన్న విషయంపై ఎటువంటి వాస్తవం లేదు. మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి రిలేషన్షిప్ ఏమీ లేదు.. కృతిసనన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది కదా.. అదే నిజం” అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రభాస్.

దీంతో ప్రభాస్ – కృతి సనన్ మధ్య ఉన్న బంధం పై వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇదిలా ఉండగా ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒకరోజు ముందే రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ వన్ ఎపిసోడ్ ఆహా లో సందడి చేస్తోంది. త్వరలోనే జనవరి 6వ తేదీన బాహుబలి పార్ట్ 2 ఎపిసోడ్ కూడా సందడి చేయబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version