pspk26 వసూళ్ళకు బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే…!

-

ఏమి ఫాలోయింగ్ రా బాబూ… ఇదేం గోల రా బాబూ… ఒక హీరో సినిమా కోసం మరీ ఇంతలా ఎదురు చూస్తారా గురూ…? ఇప్పుడు సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హడావుడి చూస్తే ఇదే అనిపిస్తుంది. దాదాపు రెండేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సినిమా రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో సందడి చేస్తున్నారు. సాధారణంగా గతంలో రీమేక్ సినిమాలతో పవన్ హిట్స్ కొట్టారు.

పలు సినిమాలు రికార్డులు బద్దలు కొట్టినవి కూడా ఉన్నాయి. దీనితో ఆయన రీ ఎంట్రీ సినిమా రీమేక్ చేస్తున్నారు అనగానే… సినిమా హిట్ అనే అంటున్నారు ఫాన్స్ అందరూ. సినిమాలో పవన్ తొలిసారిగా లాయర్ పాత్రను పోషిస్తున్నారు. దీనితో ఆ పాత్రలో ఆయన ఎలా ఉంటారో…? ఆయన కోర్ట్ సీన్స్ లో ఎలా నటిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. హిందీలో అమితాబ్ ఎంతో ఆకట్టుకున్నారు.

ఒకరకంగా ఆయన చాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. వసూళ్లు, ప్రీ రిలీజ్ మార్కెట్ కూడా భారీగా జరిగే అవకాశం ఉంది. వసూళ్లు భారీగా ఉండే అవకాశం కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హిందీ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కోసం వేణు శ్రీరాం ఏ విధంగా కొత్తగా చూపిస్తున్నారు అనేది కూడా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news