రజనీకాంత్‌కు నచ్చిన శోభన్‌బాబు సినిమా ఇదే.. థియేటర్‌లో అన్ని సార్లు చూసిన సూపర్ స్టార్..

-

తమిళ్ తలైవా, స్టైలిష్ ఐకాన్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాక ముందు బస్ కండక్టర్ గా పని చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక రజనీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్నారు.

sobhan babu shobhan babu
sobhan babu shobhan babu

ఆయన వెండితెరపైన కనబడితే చాలు… జనాలు పండుగ చేసుకుంటారు. కాగా, ఆయన బెంగళూరులో బస్ కండక్టర్ గా పని చేస్తున్న టైమ్ లో ‘సోగ్గాడు’ స్టార్ హీరో శోభన్ బాబు నటించిన ఓ సినిమాను చాలా సార్లు థియేటర్ లో చూశారు. ఆ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరో శోభన్ బాబుకు లేడీస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఫిల్మ్ రిలీజ్ అయితే చాలు జనాలు తప్పకుండా థియేటర్లకు వెళ్లి మరీ చూసేవారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు అయితే శోభన్ బాబు సినిమాలను బాగా లైక్ చేసేవారు. కాగా సినీ పరిశీలకుల విశ్లేషణల ప్రకారం ఆయన ను లేడీస్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం ‘మానవుడు దానవుడు’.

శోభన్ బాబు నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం. ఈ సినిమాను తాను థియేటర్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సార్లు చూశానని ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. తనకు ఈ చిత్రం విపరీతంగా నచ్చిందని, అందుకే అన్ని సార్లు చూశానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా స్టోరి ఇప్పటికీ ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది.

‘మానవుడు దానవుడు’ చిత్రంలోని ట్విస్ట్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రజనీకాంత్ కు ఫేవరెట్ ఫిల్మ్ అయిన ఈ సినిమాను జనాలు విశేషంగా ఆదరించారు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా, సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news