రామ్ చరణ్ మీకు ఆస్కార్ వస్తే నన్ను తాకనివ్వండి.. షారుక్ ఖాన్..

-

దర్శకుడు ధీరుడు తెరకేక్కించిన ఆర్ఆర్ అర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అయితే తాజాగా ఆస్కార్ బరిలో సైతం నిలిచింది ఈ విషయంలో ఇప్పటికే పలువు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా షారుక్ ఖాన్ ఈ విషయంపై స్పందించారు..

ఆర్ఆర్ అర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.. అయితే తాజాగా ఈ మూవీ బెస్ట్ సాంగ్‌తో పాటు మరో 14 ఇతర కేటగిరీలకు సంబంధించి ఆస్కార్ షార్ట్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. కాగా జనవరి 24న ఆస్కార్ తుది నామినేషన్స్ ప్రకటించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు హాలీవుడ్ ప్రముఖుల సైతం స్పందించగా తాజాగా షారుక్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు..

ప్రస్తుతం షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం పటాన్ తాజాగాయి సినిమా ట్రైలర్ విడుదలై అందరినీ అలరించింది.. అయితే సౌత్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, దళపతి విజయ్ తెలుగు, తమిళ్ ట్రైలర్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయడంపై షారుఖ్ వారికి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే రామ్ చరణ్.. ‘షారుఖ్ సర్‌.. మిమ్మల్ని ఇంతకుముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్సెస్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన షారుఖ్.. ‘మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు కృతజ్ఞతలు. మీ RRR టీమ్ ఇండియాకు ఆస్కార్‌ తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి!! లవ్ యూ’ అంటూ రిప్లై ఇచ్చారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే..

Read more RELATED
Recommended to you

Latest news