HBD: రాజమౌళి సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్.. హీరో ఎవరంటే?

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నది. గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటేన్ చేస్తోంది. ‘బాహుబలి’ ద్వారా నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ లో కీ రోల్స్ ప్లే చేస్తోంది. ‘రాజమాత శివగామిదేవి’ రమ్యకృష్ణ ‘బాహుబలి’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కాగా, రమ్యకృష్ణ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రాజశేఖర్, మోహన్ బాబు తదితరులందరితో నటించిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత కాలంలో యంగ్ హీరోలకు తల్లి, అత్తగానూ నటించింది. ఇటీవల విడుదలైన ‘లైగర్’ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా నటించింది.

ఈ సంగతులు అలా పక్కనబెడితే.. రాజమౌళి సినిమాలో రమ్యకృష్ణ అప్పట్లో స్పెషల్ సాంగ్ చేసింది. సూపర్ హిట్ ఫిల్మ్ ‘సింహాద్రి’లో ‘చిన్నదమ్మే చీకులు కావాలా..’ అనే సాంగ్ లో రమ్యకృష్ణ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అలా అప్పట్లో రాజమౌళి చిత్రంలో ప్రత్యేక పాట చేసిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత కాలంలో ‘బాహుబలి’లో రాజమాతగా అత్యద్భుతమైన పాత్ర పోషించింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంతో పాటు మరి కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. గతంలో రజనీకాంత్ తో ‘నరసింహ’లో ‘నీలాంబరి’ గా నటించిన రమ్యకృష్ణ..ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రజనీ చిత్రంలో నటిస్తోంది. గురువారం రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news