హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన రెబల్ స్టార్ ప్రభాస్..వీడియో వైరల్

-

తెలుగు సినీ రంగంలో ఏకైక రెబల్‌ స్టార్‌గా పేరుగాంచిన నటుడు కృష్ణంరాజు మరణంతో యావత్​ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో దర్శనం ఇవ్వటం ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభాస్ ఆసుపత్రిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ప్రభాస్ బ్లాక్ డ్రెస్ లో మాస్కు ధరించి ఉన్నారు.

ఫ్యాన్స్ ఆయన ఆసుపత్రిలో ఉన్న వీడియో చూసి కలత చెందుతున్నారు. అన్నకు ఏమైందంటూ కంగారుపడుతున్నారు. ప్రభాస్ ఆసుపత్రికి వెళ్ళటం పై చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ షూటింగులో గాయపడి ఆసుపత్రికి వెళ్ళాడు అని కొందరు అంటున్నారు. మరికొందరు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఆసుపత్రిలో ఉన్నారని, ఆయనను చూడటానికే ప్రభాస్ ఆసుపత్రికి వెళ్లాడని అంటున్నారు. అయితే, ప్రభాస్ ఎందుకు ఆసుపత్రికి వెళ్లాడన్న విషయంలో క్లారిటీ రావాలంటే ఆయన నుంచి గాని, కృష్ణంరాజు కుటుంబం నుంచి గాని ఓ అధికారిక ప్రకటన రావాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news