Big Boss OTT Telugu: ఓటింగ్‌లో దూసుకుపోతున్న అఖిల్..డేంజర్ జోన్‌లో హమీద!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ ఎనిమిదో వారం కొనసాగుతోంది.
కంటెస్టెంట్స్ అందరూ తమ గేమ్ పైన కాన్సంట్రేట్ చేస్తు్న్నారు. బిగ్ బాస్ ఇచ్చిన ఏలియన్స్ Vs హ్యూమన్స్ గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఈ టాస్కులో హ్యూమన్స్ టీమ్ విన్ అయింది. ఇక ఈ వారం ఓటింగ్ పర్సంటేజీలో అఖిల్ సత్తా చాటాడు.

గురువారం నాటి ఎపిసోడ్ లో టాస్కు విషయమై కంటెస్టెంట్స్ మధ్య మాట యుద్ధం కాస్త భౌతిక ఘర్షణ వరకు వచ్చింది. బాబా మాస్టర్ సంచాలక్ గా వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఇక ఫ్రైడే వరకు సాగిన ఓటింగ్ పర్సంటేజీలో బీబీ లవర్స్ , ఫ్యాన్స్, సపోర్టర్స్ ఓటింగ్ కంటెస్టెంట్స్ ఆశ్చర్యపడేలా ఉంది.

ఈ వారం టాప్ పర్సంటేజీ ఆఫ్ ఓటింగ్ అఖిల్ కు దక్కింది. 36 శాతం ఓటింగ్ అఖిల్ సార్థక్ కు రాగా, నెక్స్ట్ పొజిషన్ లో అనిల్ రాథోడ్ 32 శాతం ఓటింగ సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత స్థానాల్లో హమీద, అషురెడ్డి, అజయ్ ఉన్నారు.

అజయ్ కు 6 శాతం ఓటింగ్, అషురెడ్డికి 8 శాతం ఓటింగ్, హమీదకు 16 శాతం ఓటింగ్ పర్సంటేజీ వచ్చింది. అయితే, నిజానికి ఓటింగ్ పర్సంటేజీ పరంగా అజయ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. కానీ, సోషల్ మీడియాలో హమీదనే డేంజర్ జోన్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఆమెకే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news