అన్ని కోట్ల ఇల్లు కిరాక్ ఆర్పీదా..? అసలు బాగోతం బయటపెట్టిన షేకింగ్ శేషు..

-

‘జబర్దస్త్’ ఫేమ్ కిరాక్ ఆర్పీ గత కొద్ది రోజులుగా మల్లెమాలపైన, ‘జబర్దస్త్’ పైన షాకింగ్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు. కాగా, తాజాగా కిరాక్ ఆర్పీ గురించి తన తోటి కమెడియన్ అయిన షేకింగ్ శేషు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆర్పీ అసలు బాగోతం బయటపెట్టాడు.

యూట్యూబ్ లో ట్రెండవుతున్న కిరాక్ ఆర్పీ వీడియో అసలుది కాదని చెప్పాడు శేషు. ఆర్పీ ఫ్రాడ్ చేశాడని ఆరోపించారు. సెలబ్రిటీ హోమ్ టూర్ అనే పేరుతో ఇటీవల కాలంలో యూట్యూబర్స్ ..సెలబ్రిటీల ఇంటిని వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే కిరాక్ ఆర్పీ తన..హోమ్ టూర్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు..కిరాక్ ఆర్పీకి దాదాపుగా రూ.3 కోట్లకుపైనే విలువ ఉన్న ఇల్లు ఉందని అనుకుంటున్నారు.

ఆ వీడియోను తాను, తన భార్య కూడా చూసిందని షేకింగ్ శేషు చెప్పాడు. ఇక్కడే అసలు విషయం బయటపెట్టాడు. ఆర్పీ చూపించిన ఇల్లు అతడిది కాదని, అది ఎవరో కోటీశ్వరుడి ఇల్లని చెప్పాడు. ఆర్పీ ఫ్రాడ్ చేశాడన్నాడు. జనాలను గొర్రెలను చేద్దామనుకుంటే ఆర్పీనే గొర్రె అయ్యాడని శేషు విమర్శించాడు. అలా ఆర్పీ అసలు బండారం బయటపెట్టేశాడు షేకింగ్ శేషు. శేషు కామెంట్స్ పైన కిరాక్ ఆర్పీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి..

 

Read more RELATED
Recommended to you

Latest news