సోదరుల శృంగార జీవితంపై సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. కరణ్ షోలో రచ్చరచ్చ..!!

బాలీవుడ్ స్టైలిష్ ఐకాన్ సోనమ్ కపూర్ , తన బ్రదర్ అర్జున్ కపూర్ తో కలిసి తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షో లో పార్టిసిపేట్ చేసింది. ఈ షోలో సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు తన దైన శైలిలో సోనమ్ కపూర్ సమాధానాలు చెప్పగా, అవి విని షాక్ అయ్యాడు అర్జున్ కపూర్, కరణ్. ఇంతకీ ఆమె ఈ షోలో ఏం కామెంట్స్ చేసిందంటే..

 

ఇటీవల అక్షయ్ కుమార్, సమంత, విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లు ‘కాఫీ విత్ కరణ్ షో’లో పార్టిసిపేట్ చేశారు. తాజాగా కరణ్ జోహార్ షోలో సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. సోనమ్ కపూర్ గర్భిణిగా ఉండి ఈ షోకు హాజరు కావడం గమనార్హం.

‘కాఫీ విత్ కరణ్’ షో మేకర్స్ రిలీజ్ చేసిన ప్రోమోలో ..సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ చాలా చలాకీగా కనిపిస్తున్నారు. సోనమ్ కపూర్ లో బాధించే అంశం ఏంటని అర్జున్ కపూర్ ను కరణ్ అడిగాడు. అప్పుడు ఎదుటి వాళ్లు కాంప్లిమెంట్ ఇచ్చే వరకు ఎదురు చూడకుండా తనకు తానే ఇచ్చుకుంటుందని చెప్పాడు అర్జున్. అయితే, అలా చెప్పడం అర్జున్ కపూర్ కూతురు కావడం వల్ల వచ్చేసిందని సోనమ్ కపూర్ చెప్పేసింది. దాంతో ‘సోనమ్ కపూర్ ఈజ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అని అనేసి అర్జున్ కపూర్ నవ్వేశాడు.

ఈ క్రమంలోనే తన సోదరులందరూ తన స్నేహితులతో శృంగారం చేశారనే కామెంట్స్ ఇన్ డైరెక్ట్ గా చేసింది సోనమ్ కపూర్. ఆ మాటలు విని షాక్ అయ్యాడు కరణ్. ఆ మాటలు విని సోదరుల గురించి ఎటువంటి మాటలు చెప్తున్నావ్? అని సోనమ్ కపూర్ ను అడిగాడు అర్జున్ కపూర్. ఇక ఆ తర్వాత తనకు ‘మలైకా’ అనే పేరు నచ్చుతుందని అర్జున్ కపూర్ చెప్పగా, తనకు రణ్ బీర్ కపూర్ ఇష్టమని తెలిపింది సోనమ్ కపూర్.