పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే.. ద్వారంపూడి మీద పోటి చేసి గెలువు – శ్రీ రెడ్డి

-

పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే.. ద్వారంపూడి మీద పోటి చేసి గెలువంటూ టాలీవుడ్‌ వివాదస్పద బ్యూటీ శ్రీ రెడ్డి సవాల్‌ విసిరింది. శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది.

ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై విరుచుకుపడింది.

పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే.. ద్వారంపూడి మీద పోటి చేసి గెలువంటూ సవాల్‌ చేసింది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మ వద్దు, పవన్ కళ్యాణ్ కులం పేరుతో యువతని రెచ్చగొడుతున్నాడని పేర్కొంది. మీ అందరి ఓటు జగన్ అన్నకి వేసి గెలిపించండని కోరింది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version