మహేశ్ ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ సర్‌ప్రైజ్..అతి త్వరలో SSMB28 అప్‌డేట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా.. ఈ నెల 12న విడుదలై సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం పూర్తియిన నేపథ్యంలో నెక్స్ట్ ఫిల్మ్ పైన ప్రిన్స్ మహేశ్ ఫోకస్ చేస్తున్నారు.

మహేశ్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో చేయనున్నారు. త్వరలో SSMB28 షూటింగ్ స్టార్ట్ కానున్నది. కాగా, ఏటా మే 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేశ్ బాబు నటించే సినిమాల అప్ డేట్స్ ఇస్తుంటారు దర్శకులు.

‘సర్కారు వారి పాట’ టైటిల్, ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈ నెల 31న త్రివిక్రమ్ – మహేశ్ ఫిల్మ్ అప్ డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

‘అతడు, ఖలేజా’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ తర్వాత త్రివిక్రమ్-మహేశ్ చేస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘SSMB28’. కాగా, ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చూడాలి మరి.. ఈ నెల 31న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేస్తారో లేదో..