ఆయన దర్శకత్వంలో పని చేయాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన రజనీకాంత్

-

తమిళ్ తలైవా, స్టైలిష్ ఐకాన్.. సూపర్ స్టా్ర్ రజనీకాంత్.. ప్రజెంట్ ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రజనీకాంత్ ఇప్పటి వరకు తన దైన శైలిలో డిఫరెంట్ మూవీస్ చేశారు. కాగా, తనకు ఆయన దర్శకత్వంలో పని చేయాలని ఉందని ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టారు. ఆ దర్శకుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రజనీకాంత్..కు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో అశేష అభిమానులు ఉన్నారు. రజనీ సినిమా విడుదలయితే చాలు..ఆ రోజు పండుగ వాతావరణం నెలకొంటుంది. అంతటి స్థాయిలో ఆయనకు అభిమానులున్నారు. కాగా, తనకు అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలని ఉందని ఓ ఫంక్షన్ లో చెప్పారు రజనీకాంత్.

‘లింగ’ సినిమా ఫంక్షన్ లో రజనీకాంత్ తన మనసులో మాట బయటపెట్టారు. తనకు రాజమౌళి దర్శకత్వంలో పని చేసే అవకాశం రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘లింగ’ పిక్చర్ లో రజనీకాంత్ కు జోడీగా అనుష్క నటించింది. అప్పటికే ‘బాహుబలి’ చిత్రం విడుదలై సంచలనమయింది. అలా రజనీ కాంత్ తనకు రాజమౌళితో సినిమా చేయాలనుందని చెప్పారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఇటీవల విడుదలైన సంచలనమైన సంగతి అందరికీ విదితమే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం చూసి ప్రేక్షక లోకం ఫిదా అయిపోయింది. తెలుగు చిత్ర సీమ స్థాయిని పెంచిన దర్శకుడిగా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోతుందని ప్రతీ ఒక్కరు కొనియాడారు. రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ మహేశ్ బాబుతో చేస్తున్నారు. చూడాలి మరి.. భవిష్యత్తులో రాజమౌళి ..రజనీకాంత్ ను డైరెక్ట్ చేస్తారో లేదో..

 

 

Read more RELATED
Recommended to you

Latest news