చీరకట్టులో తమన్నా అందాల విందు.. డ్రెస్​ ధర తెలిస్తే మైండ్​ బ్లాక్​!

-

స్టార్ హీరోయిన్​గా వెలుగొందుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా… భారీ చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియా ద్వారా ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. అయితే ఇటీవల కాస్తా సోషల్ మీడియాలో రచ్చ తగ్గిన తమన్నా.. తాజాగా ట్రెడిషనల్ గా దర్శనమిచ్చింది. చీరకట్టులో కొన్ని గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.

Image

ప్రస్తుతం ఈ అమ్మడు.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్​లో నిర్వహిస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్​కు హాజరైంది. అక్కడే ఆమె చీరకట్టులో కనువిందు చేసి కెమెరాకు పోజులిచ్చింది. గ్రీన్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను విందును వడ్డించింది. చీరకొంగును చేతితో పట్టుకొని తమన్నా ఇచ్చిన ఒక్కో స్టిల్ కు యువత చిత్తైపోతున్నారు. ఆమె మత్తు చూపులకు, ఒంపుసొంపులకు మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో తమన్నా పోస్ట్ చేసిన పిక్స్ ను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. తమన్నా ఫొటోలు నెట్టింట ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ చీర ఖరీదా దాదాపు రూ.70వేలు అని తెలిసింది.

Image

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)కు రాజీవ్ మసాంద్, వాణీ కపూర్, జానకీ ఈశ్వర్, అభిషేక్ బచ్చన్, షెఫాలీ షా, తమన్నా భాటియా హాజరయ్యారు. ఈ వెడుకలో ప్రదర్శించే చిత్రాలను వీక్షించే వారు టికెట్స్​ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫెస్టివల్ లో వందకుపైగా చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఇక తమన్నా కేరీర్ విషయానికొస్తే.. ‘బాహుబలి’ తర్వాత తమన్నాకు భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే ‘ఎఫ్3’తో అలరించిన ఈ బ్యూటీ.. ‘గుర్తుందా సీతాకాలం’, ‘భోళా శంకర్’ , హిందీలో ‘బబ్లీ బౌన్సర్’, ‘భోలే చుడియా’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దాదాపు ఈ చిత్రాలన్నింటిలో తమన్నా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news