పవన్ కల్యాణ్ క్రేజ్‌కు ప్రముఖ తమిళ దర్శకుడు ఫిదా..

-

తెలుగునాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క తెలుగు నాటనే కాదు దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్ కు అభిమానులు అశేషంగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ఆయన్ను అభిమానించే వారున్నారు. కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఒకరు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరంటే…

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎన్.లింగు స్వామి ఇటీవల టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ద వారియర్’ అనే పిక్చర్ చేశారు. ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ బాగా హిట్ అయింది. రిలీజ్ కు ముందు ఫిల్మ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ఆడలేదు. ఈ సంగతులు అలా పక్కనబెడితే దర్శకుడు లింగు స్వామి పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ సినిమా విడుదల అయితే చాలు.. థియేటర్ల వద్ద అభిమానుల చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే తాను ఒకసారి పవన్ కల్యాణ్ సినిమా థియేటర్ లో చూశానని గుర్తు చేసుకున్నారు లింగుస్వామి. పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ చూసి తాను ఫిదా అయినట్లు తెలిపారు దర్శకుడు లింగు స్వామి.

దర్శకుడు లింగు స్వామి.. పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ‘జల్సా’ ఫిల్మ్ ను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ ను బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఇవ్వబోతున్నారని వార్త తెలుసుకుని పవన్ అశేష అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news