దళపతి విజయ్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘లియో’ ప్రీమియర్స్​కు లైన్ క్లియర్

-

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులకు శుభవార్త. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్​గా నటిస్తున్న విజయ్ లేటెస్ట్ మూవీ లియో ప్రీమియర్​కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో… తమిళనాడు ప్రభుత్వం.. ఇటీవల ‘లియో’ సినిమా ప్రీమియర్స్​కు అనుమతి నిరాకరించింది. విజయ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే తాజాగా ‘లియో’ ప్రీమియర్స్​కు లైన్ క్లియర్ చేస్తూ.. స్టాలిన్ సర్కార్ ప్రీమియర్స్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నిర్ణయంతో విజయ్ ఫ్యాన్స్​ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల రోజున అక్టోబర్ 19వ తేదీన తమిళనాడులో ఉదయం 7 గంటలకే ప్రీమియర్​ షో ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 నుంచి 24వ తేదీ వరకు రోజుకు లియో ఐదు షోస్ ప్రదర్శించనున్నారు. మరోవైపు యూఎస్​లో అక్టోబర్ 19 ఉదయం 4 గంటలకే లియో షోస్ షురూ కానున్నాయి. ఇక ఇప్పటికే లియో బుకింగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్​ గతవారం ఓపెన్​ అయ్యాయి. ఇప్పటి వరకు 40 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version