ఆ కుటుంబాల చేతిలో బందీగా ఉన్న తెలుగు పరిశ్రమ : అమలాపాల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అమలాపాల్ ఇటీవల తెలుగు పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇకపోతే తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా టాలీవుడ్ లో మాత్రం ఆ కుటుంబాలదే ఆధిపత్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. నిజానికి 2011లో బెజవాడ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు వంటి సినిమాలలో నటించింది. ఇకపోతే ఆ తర్వాత వరుస డిజాస్టర్ లు రావడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమయింది. ఇక ఇటీవల ఈమె చేసిన తమిళ్ సినిమా కడవర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు మరొక ఓటిటి ఫిలిం పిట్టకథలు కూడా చేసి ఆకట్టుకుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలాపాల్.. తెలుగులో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏమిటి అని అడగగా ఆమె ఈ విధంగా టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను మొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొన్ని ఫ్యామిలీల చేతుల్లోనే ఉందని అర్థమైంది. మా ఫ్యామిలీలు మాత్రమే టాలీవుడ్ ను శాసిస్తుంటాయని ఆధిపత్యం చెలాయిస్తుంటాయని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆ సమయంలో వారు తీసే సినిమాలు డిఫరెంట్ గా ఉండేవని.. వారు నటించే ప్రతి సినిమాలో కూడా ఇద్దరూ హీరోయిన్లు ఉండే వారని, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసం మాత్రమే చూపించే వారని తెలిపింది. ఇక అంతే కాదు హీరోయిన్లు అంటే కేవలం కొన్ని లవ్ సన్నివేశాలు , పాటల్లో మాత్రమే కనిపిస్తారు .

మిగతా అంతా హీరో పాత్రే ఉంటుంది. అసలు తెలుగు పరిశ్రమలో హీరోయిన్లకు విలువ లేదు మొత్తం కమర్షియల్ సినిమాలు ఎక్కువగా తీస్తారు అంటూ ఆమె వెల్లడించింది. ఇకపోతే కోలీవుడ్లో సినిమాలు చేయడంపై ప్రశంసలు కురిపించింది. తమిళంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు అమలాపాల్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news