Big Boss Non Stop: ఈ సారీ డబుల్ ఎలిమినేషన్..ట్విస్ట్ ఇవ్వబోతున్న ‘బిగ్ బాస్’

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ ఓటీటీ వర్షన్ గా కొనసాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో 17 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది. హౌజ్ లో ప్రస్తుతం 11 మంది ఇంటి సభ్యులు ఉన్నారు.

గత వారంలాగే ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నదని వార్తలొస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో అనిల్‌, నటరాజ్‌, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్‌, అరియానా, మహేశ్‌ విట్టా ఉన్నట్లున్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ప్రజెంట్ చర్చనీయాంశంగా ఉంది. టాప్ కంటెస్టెంట్ గా బిందుమాధవి ఓటింగ్ పర్సంటేజీలో దూసుకుపోతున్నది.

మిత్రా శర్మ గతంలోనే ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆమె ప్రతీ సారి సేఫ్ అవుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా ఆమె సేఫ్ అని టాక్. ఇక మిగిలిన వారిలో డేంజర్ జోన్ లో అనిల్‌, మహేశ్‌ ఉన్నట్లు కనబడుతున్నారు.

ఈ ఇద్దరి కంటెస్టెంట్స్ లో ఈ సారి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ చాలా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..‘బిగ్ బాస్’ ఏదేని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..నాగార్జున ఏం చెప్తారనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news