‘ది కాశ్మీర్ ఫైల్స్’ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

-

‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇండియా వ్యాప్తంగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. లోబడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా విమర్శలు ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు రూ. 200 కోట్లు వసూలు చేసే దిశగా వెళ్తోంది. 80,90లో కాశ్మీర్ లో ఓ వర్గం ప్రజలు కాశ్మీర్ పండిట్లపై చేసిన దమనకాండను, వారి కన్నీటి గాథను కళ్లకు కట్టేలా తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి నటులు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమాను ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా.. ఇతర బీజేపీ నాయకులు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు మాత్రం సినిమా ఓ వర్గంపై విషం చిమ్మేలా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ లో సినిమా గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు.  ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ వర్గంపై విద్వేషపూరిత కామెంట్స్ చేశారు. దీనిపై ప్రకాష్ రాజ్ ‘ కాశ్మీర్ ఫైల్స్’ గాయాలను నయం చేస్తుందా..? విద్వేష బీజాలు నాటి .. గాయాలను మాన్పుతుందా? అని రాసుకొచ్చారు. ప్రకాష్ రాజ్ కామెంట్లపై చాలా మంది నెటిజెన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తుండగా.. కొంతమంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news