సెన్సార్ కట్ లేని బాలయ్య సినిమా విశేషాలివే…!

-

నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల ‘అఖండ’ చిత్రంతో ఘన విజయం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన 107 వ చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నట, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య..సీనియర్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు.

తన సినీ కెరీర్ లో బాలయ్య సాంఘీక, జానపద, పౌరాణిక పాత్రలను పోషించారు. ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు చేయడంలో బాలయ్య ముందుంటారు. ఫ్యాక్షన్ మూవీస్ చేసి రాయల సీమ చిన్నోడిని అంటూ బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్ బాలయ్య ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కాగా, బాలయ్య కెరీర్ లో సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి ఒక్క కట్ కూడా లేదని చెప్పిన సినిమా కూడా ఉందండోయ్.. ఆ మూవీ ఏంటి? దాని విశేషాలు ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ విదితమే. ఈ మూవీలో బాలకృష్ణ నటనను చూసి జనాలు వావ్ అన్నారు. అత్యద్భుతమైన అభినయంతో అభిమానులను ఈ చిత్రంలో బాలయ్య అలరించారు.

బాలయ్య కు జోడీగా ఇందులో హీరోయిన్ గా రోజా నటించింది. చందమామ విజయా కంబైన్స్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. సెన్సార్ సందర్భంగా ఈ సినిమా మరో రికార్డు క్రియే ట్ చేసింది. ఈ పిక్చర్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఒక్క కట్ కూడా లేదని చెప్పారు.

ఒకే ఒక్క సీన్ లో గుర్రాళ్ల విషయమై చిన్న అభ్యంతరం చెప్పారట. వన్యప్రాణి సంఘం వాళ్లు ఒకవేళ అభ్యంతరం తెలిపినట్లయితే ఆ సీన్ తొలగించాలని మూవీ యూనిట్ కు సెన్సార్ బోర్డు సూచించింది. అయితే, చిత్ర విడుదల తర్వాత ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. అలా ఆ చిత్రం ఒక్క సెన్సార్ కట్ లేకుండానే విడుదలై ఘన విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో నే ది బెస్ట్ ఫిల్మ్ గా ‘భైరవ ద్వీపం’ నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news