ఈ స్టార్స్​ది మన దేశం కాదా?

-

ఎన్నో ఏళ్లుగా భారత చిత్రసీమలో నటిస్తూ స్టార్స్​గా ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు పలువురు నటులు. ఇప్పటికీ అంతులేని వినోదాన్ని అందిస్తున్నారు. కానీ వీరిలో కొంతమందికి నటులకు భారత పౌరసత్వం లేదు. అయినా వారు ఎంతలా ఇక్కడి వారిలా కలిసిపోయాలంటే.. ఈ విషయం నమ్మాలంటే కూడా కాస్త సమయం పడుతుంది. అంతలా వారు మనలో ఒకరిగా కలిసిపోయారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంతకీ వారు ఎవరు? ఏయే దేశాలకు చెందినవారు? ఇలాంటి సంగతుల సమాహారమే ఈ కథనం.

ఆలియాభట్.. ‘స్టూడెంట్​ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆలియా భట్.. తక్కువ సమయంలోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్​ చిత్రాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీనటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే లండన్​లో పుట్టి పెరిగిన ఈమెకు బ్రిటీష్ పౌరసత్వం ఉంది. తండ్రి మహేశ్​భట్​ భారత్​లోని ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి సోనీ రజ్దాన్.. బ్రిటీష్ నటి. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ గంగూబాయ్​, ఆర్​ఆర్​ఆర్​ ప్రేక్షకుల్ని అలిరించింది. త్వరలోనే ‘బ్రహ్మాస్త్రం’తో అభిమానుల ముందుకు రానుంది.

అక్షయ్ కుమార్.. భారత్​లో జరిగిన ఎన్నికల్లో మీరు ఎప్పుడైనా ఓటు వేయడం చూశారా? బహుశా చూసుండకపోవచ్చు. ఎందుకంటే అతడు పంజాబ్​లోని అమృత్​సర్​లో పుట్టి పెరిగినా, కెనడా పాస్​పోర్ట్​ కోసం భారత పౌరసత్వాన్ని వదలుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడే ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. 2016లో ‘రుస్తుమ్’ సినిమాకుగాను జాతీయ నటుడిగా అవార్డును అందుకోవడం విశేషం. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. చివరగా ఆయన ‘పృథ్వీరాజ్’​తో అభిమానుల్ని అలరించారు.

కత్రినా కైఫ్.. బాలీవుడ్​లో అత్యధిక రెమ్యునరేషన్​ తీసుకునే నటీమణుల్లో కత్రినాకైఫ్ ముందుంటుంది. గత కొన్నేళ్లలో స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ.. ఎన్నో సూపర్​హిట్​లు తన ఖాతాలో వేసుకుంది. అయితే హాంగ్​కాంగ్​లో పుట్టిన పెరిగిన కత్రినాకు ప్రస్తుతం బ్రిటీష్ పౌరసత్వం ఉంది. ఇటీవలే హీరో విక్కీకౌశల్​ను పెళ్లాడింది. ప్రస్తుతం విజయ్​సేతుపతితో కలిసి ‘మెరీ క్రిస్మస్​’ సినిమా చేస్తోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. 2009లో ‘అల్లాదీన్’తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్​గా, ప్రత్యేక గీతాల్లో కనువిందు చేసింది. అయితే ఈమె శ్రీలంకకు చెందిన నటి. 2006లో ఆ దేశ మిస్ యూనివర్స్​గా నిలిచింది. అయితే ఈమె.. కెనడా, శ్రీలంక, మలేసియా మూలలున్న కుటుంబంలో జన్మించింది. బహ్రెయిన్​లో పెరిగింది. ప్రస్తుతం కిచ్చా సుదీప్​ నటించిన ‘విక్రాంత్​ రోణా’లో నటించింది.

నర్గీస్ ఫక్రీ.. ‘రాక్​స్టార్’ అనే రొమాంటిక్ డ్రామాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది నర్గీస్ ఫక్రీ. ఆ సినిమాకుగాను ఫిల్మ్​ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత ‘మద్రాస్ కేఫ్’, ‘హూస్​ఫుల్ 3’ వంటి చిత్రాల్లో నటించింది. ఆసక్తికర విషయం ఏంటంటే న్యూయార్క్ నగరంలోని క్వీన్స్​లో పుట్టిన నర్గీస్​కు అమెరికా పౌరసత్వం ఉంది. ఈమె నాన్నది పాకిస్థాన్ కాగా, అమ్మది చెక్.

Read more RELATED
Recommended to you

Latest news