అల్లు అర్జున్, త్రివిక్రం మొదలైంది.. AA19 షూటింగ్ బిగిన్స్ (వీడియో)

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఈరోజు సెట్స్ మీదకు వెళ్లింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈరోజు షూటింగ్ మొదలుపెట్టారు.

AA19 షూటింగ్ మొదలు పెట్టిన వీడియో రిలీజ్ చేశారు. యూనిట్ అంతా షూటింగ్ కు రెడీ అవుతుండగా కారు నుండి దిగిన అల్లు అర్జున్ తన టీం ను విష్ చేస్తాడు. ఇక నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ కూడా షూటింగ్ స్పాట్ లో ఉన్నారు. ఫైనల్ గా త్రివిక్రం యాక్షన్ అని చెప్పి షూటింగ్ మొదలు పెట్టాడు. మొత్తానికి ఆరంభం అదరగొట్టగా ఈ సినిమా బన్ని కెరియర్ లో మరో క్రేజీ మూవీ అవుతుందని అంటున్నారు. సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజి, రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న బన్ని ఫ్యాన్స్ కు పండుగ మొదలైందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news