‘మ్యారీ మీ’ అంటూ వారి నుంచి సమంతకు వేధింపులు..!!

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత..యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. సోషల్ మీడియాలో డైవోర్స్ తర్వాత సమంత..ఇంకా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ..ట్రోల్ చేసే వారికి దిమ్మదిరిగిపోయే సమాధానాలిస్తున్నది.

సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న క్రమంలో అక్కినేని కుటుంబంతో సమంత సంబంధాలు తెగిపోయాయాయి. ఇకపోతే సమంత ..తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఐటెం సాంగ్ కూడా చేసేసింది. అందులో బోల్డ్ షో రెచ్చిపోయి మరి చేస్తోంది. ఈ విషయమై నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

సమంత గ్లామర్ షోను అడ్డుకునే వారే లేరని అంటున్నారు. కాగా, ఇవేవీ పట్టించుకోకుండా సమంత..హ్యాపీగా తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతోంది. అలా తన స్నేహితులతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేయగా, అందుకు సంబంధించిన రీల్ ఒకటి ప్రజెంట్ వైరలవుతోంది. సదరు రీల్ లో స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో పాటు మరో ఫ్రెండ్ ఒకరు ‘మ్యారీ మీ’ అంటూ కామెంట్ చేశారు. అది చూసి నెటిజన్లు సమంతను ఆ ఇద్దరు వేధిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యతో సమంత విడాకులకు ఆ ఇద్దరే కారణమని కొందరు పోస్టులు పెడుతున్నారు.

మరో వైపున సమంత..నటించిన ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ లో సమంత టైటిల్ రోల్ ప్లే చేసింది. ‘యశోద’ అనే మరో పాన్ ఇండియా ఫిల్మ్ కూడా చేస్తోంది సమంత. ఇది సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news